అనంతగిరి మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముస్కు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతకుంట్ల సూర్యం, మండల కార్యదర్శి బెల్లంకొండ పరిసరాములు, పాలవరం తండా గ్రామ శాఖ అధ్యక్షుడు అట్టియ, సీనియర్ నాయకులు దొంతగాని అంజయ్య గౌడ్ తదితరులు శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.