నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు తొలి మహిళా ఎస్‌ఐగా తేజస్విని

2739చూసినవారు
నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు తొలి మహిళా ఎస్‌ఐగా తేజస్విని
కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డిని నడిగూడెం పోలీస్ స్టేషన్ తొలి మహిళా ఎస్‌ఐ తేజస్విని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విధి నిర్వహణలో ప్రజలకు అందుబాటులో ఉండి నిష్పాక్షికంగా సేవలందించాలని ఆకాంక్షించారు. నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు తొలి మహిళా ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్‌ఐ తేజస్విని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్