నల్గొండ జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులు తమ నియోజకవర్గాలను మార్చుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ జనరల్ స్థానంగా మారే అవకాశం ఉంటుందన్న చర్చ నేపథ్యంలో అక్కడి నుంచి వెంకటరెడ్డి, చౌటుప్పల్ నియోజకవర్గంగా ఏర్పడితే రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.