రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల పట్ల ఉదాసీనత వైఖరి ప్రదర్శించడం సరికాదని బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో శనివారం జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అప్పుడే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందుల నుండి కాపాడవచ్చని తెలిపారు. ఫీజులను ఇష్టం వచ్చినట్లు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.