నల్గొండ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నారబత్తుల అనంతాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగవెల్లి జ్యోతి ఈ విషయాన్ని తెలిపారు. అనంతాచారి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి వార్డు మెంబర్‌కు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని, వార్డు మెంబర్ల గౌరవ వేతనం కోసం ప్రభుత్వంపై పోరాడతానని తెలిపారు.