మిర్యాలగూడలో బీఆర్ఎస్ జోష్

3చూసినవారు
మిర్యాలగూడలో బీఆర్ఎస్ జోష్
మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు బుధవారం పట్టణంలోని రెడ్డి కాలనీలో గల పార్టీ కార్యాలయంలో 18వ వార్డు – సుందర్ నగర్ నుండి పెద్ది శ్రీనివాస్ గౌడ్, గుంజ కొండల్, మల్లేష్ ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫిబ్రవరి 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ పట్టణంలోని అనేక వార్డుల నుండి పోటీ చేసే అభ్యర్థులు దొరక్క కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జోష్ కొనసాగుతోందని వారు తెలిపారు.

ట్యాగ్స్ :