జాతీయ రహదారిపై కారు బీభత్సం

10చూసినవారు
జాతీయ రహదారిపై కారు బీభత్సం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో కారు బైక్‌ను, ఎదురుగా వస్తున్న ఇద్దరిని ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్