గురువారం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తో కలిసి మాడుగుల పల్లి మండలం, చిరుమర్తి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి రంగు మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైస్ మిల్లుతో సమన్వయం చేసుకుని ధాన్యం దించుకునేలా చూడాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు.