
లారీ, ఆటో ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
AP: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని జమేదారిపుట్టుగ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటోలోని ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




