జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ మునీర్ కి ఘన సన్మానం.

1973చూసినవారు
జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ మునీర్ కి ఘన సన్మానం.
జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా బుధవారం మిర్యాలగూడ పట్టణంలో పతంజలి నిత్య యోగ సాధన ఆధ్వర్యంలో జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ ని ఘనంగా సన్మానించారు. గత 30 సంవత్సరాలుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ మునీర్ తెలిపారు. యోగ ట్రైనర్ నాగేందర్ డాక్టర్ మునీర్ సేవలను అభినందిస్తూ, సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, లక్ష్మి, రాజ్యలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్