
తప్పుడు ఆరోపణలు రుజువైతేనే మానసిక వేధింపు: మద్రాస్ హైకోర్టు
భర్త, అత్తమామలపై వివాహితలు చేసే తప్పుడు ఆరోపణలు రుజువైతే తప్ప వాటిని మానసిక వేధింపుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక విడాకుల కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య చేసిన తప్పుడు ఫిర్యాదులతో మానసిక వేదనకు గురయ్యానని, విడాకులు మంజూరు చేయాలని పిటిషనర్ కోరగా, ఆధారాలు పరిశీలించిన కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.




