రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రేపు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాకు ఔట్ సోర్సింగ్ జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్ ఉద్యోగులందరినీ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన శనివారం నల్లగొండ జిల్లా దామరచర్లలో ఆవిష్కరించారు.