మాడుగులపల్లి మండలం ధర్మాపురంలో మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ, దీప్తి ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్‌నేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు.