మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో గురువారం చేపల వేటకు వెళ్లిన నూకల శంకర్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతయ్యాడు. రూరల్ పోలీసులు, గ్రామస్థులు చెరువులో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంకర్ కుటుంబ సభ్యులు చెరువు గట్టున కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.