
స్కూల్ టాయిలెట్లో విద్యార్థిని ప్రసవం.. పసికందు మృతి
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, శిరసి తాలూకాలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం స్కూల్ టాయిలెట్లో ప్రసవించింది. అనంతరం ఆ పసికందును మరుగుదొడ్డి కిటికీ గుండా బయటకు విసిరేయడంతో అక్కడికక్కడే మరణించింది. పాఠశాల వెనుకవైపు శుభ్రం చేయడానికి పనివాళ్లు వెళ్లగా ఆ పసికందు మృతదేహం కనిపించింది. విషయం తెలిసిన వెంటనే ఆ పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.




