నల్గొండ: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్లు

2చూసినవారు
నల్గొండ: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్లు
హాలియా పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో సోమవారం గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలడంతో సముద్రాల భాస్కర్‌కు చెందిన ఇల్లు దగ్ధమైంది. సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ మంటలు ఎగసిపడి ఇంటి సామగ్రి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హాలియా సీఐ సతీశ్ రెడ్డి, ఎస్ఐ ప్రశాంత్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

సంబంధిత పోస్ట్