నెల రోజులుగా తమను భయభ్రాంతులకు గురిచేస్తున్న భారీ కొండ చిలువను ఎట్టకేలకు నేరేడుచర్ల మండలం బూర్గుల
గ్రామస్థులు తుదముట్టించారు. గ్రామానికి చెందిన రంజాన్ అనే వ్యక్తి ఇంటివద్ద కోడిని నోటకరిచిన కొండచిలువను గురువారం గ్రామస్ధులు చంపేశారు. ఈ కొండ చిలువ బుధవారం అదే ఇంటి వద్ద కోళ్ల గంప దగ్గర కనిపించడంతో చంపే ప్రయత్నం చేయగా తప్పించుకుని చెట్లలోకి వెళ్లిపోయింది. మళ్లీ గురువారం వచ్చి కొండచిలువ కోడిని నోటకరిచే ప్రయత్నంలో ఉండగా గ్రామస్తులు హతం చేశారు.