జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం త్వరలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఆయన నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్ సతీశ్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో నాగబాబు, హైపర్ ఆది కూడా పాల్గొంటారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 43 మంది అభ్యర్థులు స్థానిక సమస్యలను ఎజెండాగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు.