బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచాలని బీసీ లకు 42% రిజర్వేషన్ సాధన సమితి జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు, మండల తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.