రూ. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం..

2చూసినవారు
రూ. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం..
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని, గెలుపు ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుపేదలకు 3.17 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి రూ.21 వేల కోట్లు జమ చేశామని, రైతు సంక్షేమం కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్