
పెళ్లిలో మద్యం పోయలేదని నూతన దంపతులపై దాడి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మహేష్ జాతవ్ పెళ్లి వేడుకలో మద్యం కోసం డబ్బులు అడిగిన పొరుగువారితో గొడవ జరిగింది. వరుడు నిరాకరించడంతో ఆగ్రహించిన పొరుగువారు పెళ్లి కూతురు, వరుడు, వారి తల్లిదండ్రులపై దాడి చేసి, ఇంట్లోని సామాన్లు, నగదును దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




