నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్, జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై రాజీలేని వైఖరి అవలంబిస్తామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలో ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత నాకాబందీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సైలెన్సర్లలో మార్పులు చేసి అధిక శబ్దం చేయడం, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి, వాటిపై కేసులు నమోదు చేశారు.