మున్సిపల్ బరిలోకి బత్తుల కుటుంబం

7చూసినవారు
మున్సిపల్ బరిలోకి బత్తుల కుటుంబం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి, ఆయన ఇద్దరు కుమారులు బత్తుల సాయిప్రసన్న, బత్తుల ఈశ్వర గణేష్‌ కుమార్‌లు మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఈశ్వర గణేష్‌ 28వ వార్డు నుంచి, భార్య మాధవి 39వ వార్డు నుంచి, పెద్ద కుమారుడు సాయిప్రసన్న 40వ వార్డు నుంచి పోటీ చేయనున్నారు. ఈ చర్యతో మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కుటుంబం క్రియాశీలకంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్