రోహిణికార్తె ప్రవేశంతో రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మంగళవారం దాదాపు అన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో 46.5 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని, క్యుములోనింబస్ మేఘాల కారణంగా బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.