పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి

3చూసినవారు
పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి
సంక్రాంతి పండుగ సందర్భంగా తమ విలువైన సామాన్ల భద్రతలో జాగ్రత్తలు పాటించాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు సూచించారు. శనివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణతో కలిసి దొంగతనాల నివారణపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. పండుగలకు ఇతర ఊర్లకు వెళ్లేవారు ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లకూడదని, ఇది దొంగలకు సులువుగా మారుతుందని తెలిపారు. ఇంటి ప్రధాన ద్వారానికి నాణ్యమైన తాళం వేసుకుని, తాళం కనిపించకుండా కర్టెన్ వేసి ఉంచాలని ఆయన సలహా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్