
సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. భార్య మృతి.. లభించని భర్త ఆచూకీ
అనుమానాస్పద రీతిలో శనివారం సాయంత్రం సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారును ఆదివారం రెస్క్యూ టీం, పోలీసుల సహాయంతో బయటకు తీశారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న భార్య పద్మ మృతదేహం లభించగా, భర్త తల్లం పుల్లయ్య ఆచూకీ లభ్యం కాలేదు. గత నెలలో బైక్ ప్రమాదంలో గాయపడి, ఇటీవల కుమారుడి వద్దకు వచ్చిన ఈ దంపతులు స్వగ్రామానికి బయలుదేరగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు బయటకు తీశాక కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానికులు పక్కా ప్రణాళిక ప్రకారమే కారును కాల్వలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీమా డబ్బుల కోసమే కావాలని ప్రమాదంగా చిత్రీకరించి హతమార్చారనే రూమర్లు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలనుంది.








































