ఏదో ఒకరోజు బాంబ్ పేల్చడం ఖాయం

4చూసినవారు
ఏదో ఒకరోజు బాంబ్ పేల్చడం ఖాయం
తనకు పదవి రాకున్నా పర్వాలేదని, మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం కొనసాగితే ఏదో ఒకరోజు బాంబు పేల్చడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పనులు చేపట్టిన బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సగంలో నిలిపివేసి, తాము చేయలేమని చేతులెత్తేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్