తడి, పొడి చెత్త సేకరణతో తయారు చేసే వర్మి కంపోస్ట్‌తో గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయంతో పాటు ఉపయోగాలు ఉంటాయని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, దేవరకొండ డివిజినల్ పంచాయతీ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పరిధిలోని కచలాపురం గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్‌లో వర్మి కంపోస్ట్ తయారిపై మునుగోడు, చండూరు, గట్టుప్పల్ మండలాల అధికారులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.