సర్పంచ్ చేతుల మీదుగా పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం

1002చూసినవారు
సర్పంచ్ చేతుల మీదుగా పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం
నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు డాక్టర్ శాలిని, డాక్టర్ దీపక్, ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్, ఎన్ఎం అరుణ, వార్డ్ సభ్యులు నల్ల శేఖగౌడ్, కొండాపురం నరేష్, జర్పుల హనుమంతు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్