నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలంలోని చేనేత కార్మికులకు చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఇడం కైలాసం డిమాండ్ చేశారు. ఈరోజు మండల కేంద్రంలో చేనేత కార్మికులతో మాట్లాడుతూ, ఎన్నికలలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్నికల తర్వాత దానిని లక్షకు కుదించి చేనేతల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీని పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసి, గ్రామీణ ప్రాంత చేనేత కార్మికులకు అందజేయలేదని ఆయన అన్నారు.