కండ్లు బాగుంటే ఏ పనైనా చేసుకోవచ్చు

1చూసినవారు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కండ్లు బాగుంటే ఏ పనైనా చేసుకోవచ్చని, ఇంకో 10 సంవత్సరాలు బతకొచ్చని అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్రపటానికి నివాళులర్పించి కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఆరు కౌంటర్లలో కంటి పరీక్షల నిర్వహణను పరిశీలించి, పరీక్షలకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించారు.