నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని వెల్మకన్నె గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ కంపే దుర్గయ్య ఈరోజు సీపీఐ పార్టీలో చేరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి మరో 30 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు సీపీఐ పార్టీలో చేరారు. ఈ చేరికలతో గట్టుప్పల మండలంలో సీపీఐ పార్టీ బలోపేతం అయింది.