మర్రిగుడ మండలంలోని శివన్నగూడ గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ పనులను నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు శనివారం అడ్డుకున్నారు. సంవత్సరం కింద అధికారులు మభ్యపెట్టి గ్రామాన్ని ఖాళీ చేయించారని, నేటికీ రావాల్సిన ఆర్ అండ్ ఆర్, ప్లాట్లు పూర్తిస్థాయిలో అందించలేదని, అవి అందించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు పనులు జరగకుండా యంత్రాలను అడ్డుకున్నారు.