ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా మర్రిగూడ వాసి

1చూసినవారు
ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ  రాష్ట్ర కన్వీనర్ గా మర్రిగూడ వాసి
వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన పగడాల లింగయ్య నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26 న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తనకు చోటు కల్పించడం సంతోషకరమని లింగయ్య అన్నారు.

సంబంధిత పోస్ట్