చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన 26 ఏళ్ల నిరుపేద యువకుడు నెల్లి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే స్పందించి, తన వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి పంపి, కిడ్నీ మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయించారు. రూ. 12.50 లక్షలు చెల్లించి గణేష్ కు కిడ్నీ మార్పిడి చికిత్స చేయించగా, చికిత్స అనంతరం ఆదివారం ఎమ్మెల్యే కామినేని ఆసుపత్రికి వెళ్లి గణేష్ ను పరామర్శించారు.