విద్య, వైద్యానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రానున్న రోజుల్లో విద్య, వైద్యానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు బహుమతి ప్రదానం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తి జీవితంలో విద్యే అతిపెద్ద ఆస్తి అని, పేద విద్యార్థులకు సేవ చేసే అవకాశం దొరికినందుకు దేవుడికి రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామాల్లోని ప్రభుత్వ బడుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
