రానున్న రోజుల్లో మునుగోడు ఎడారి కాబోతుంది

0చూసినవారు
రానున్న రోజుల్లో మునుగోడు ఎడారి కాబోతుంది
ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే మౌనం వల్ల మునుగోడు నియోజకవర్గం భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుళ్ళ వద్ద నీటి పంపకాలలో అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే మౌనంగా ఉండడం దారుణమని ఆయన పేర్కొన్నారు. తమకు రావాల్సిన 0.5 టీఎంసీలకు 436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీటి పంపకాల విషయంలో ప్రభుత్వం సమతుల్యం పాటించాలని, లేదంటే శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్