నల్గొండ: కవితపై రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు

1183చూసినవారు
నల్గొండ: కవితపై రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు
కాంగ్రెస్‌ MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు. కవిత సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. ఆమె కొత్త పార్టీ స్థాపన హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఉద్యమకారుడి కుమార్తెగా కవితకు ప్రజల్లో గుర్తింపు ఉన్నప్పటికీ, తొలి సభలోనే తండ్రిని విమర్శించడం సరైంది కాదన్నారు. కుటుంబ విలువలను గౌరవించని వ్యక్తి నాయకత్వం ఎలా వహిస్తారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్