వేసవికాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ సూచించారు. పీపల్ పహాడ్ గ్రామాలలో ఆయన మాట్లాడుతూ, చాలా మంది ప్రజలు వేసవిలో డాబాలపై, ఆరుబయట నిద్రపోతున్నారని, ఇళ్లకు తాళాలు వేయకుండా తలుపులు దగ్గరికి వేసి నిద్రపోతున్నారని, ఇదే అదునుగా దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.