పిట్టల రమేష్ మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. మండలంలోని శివన్నగూడ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో పార్టీ బలోపేతాని ఆయన ఎంతో కృషి చేశారని, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి పోతాయని గుర్తు చేస్తూ విప్లవ జోహార్లు అర్పించారు.