అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు!

4చూసినవారు
అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు!
చండూరు మండల పరిధిలోని గ్రామాలలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయించడాన్ని అరికట్టేందుకు చండూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో బెల్ట్ షాపుల నిర్వహణకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, నవంబర్ 3, 4 కలిపి మొత్తం 32 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 17 మందిని చండూరు మండల తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేశారు. ఎస్సై జె. శివకుమార్ మాట్లాడుతూ చండూరు మండల పరిధిలో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించిన అనుమతులు లేకుండా మద్యం విక్రయించిన చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్