నల్లగొండ జిల్లా అటవీ శాఖ డివిజనల్ అధికారి వై. శ్రీనివాస్ మాట్లాడుతూ, ధరిత్రి రక్షణ బాధ్యత మనందరిదని అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ధరిత్రి దినోత్సవ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 22న ధరిత్రి దినోత్సవం సందర్భంగా నల్లగొండలో ఇండియన్ ఎన్విరాన్‌మెంట్ సోషల్ ఫోరం నిర్వహించే సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. భూమిని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు.