లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్ఐ

4చూసినవారు
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్ఐ
నల్గొండ జిల్లా నాంపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ గోపరాజు రూ. 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఒక రైతు పౌతి కోసం డబ్బులు డిమాండ్ చేయగా తన అసిస్టెంట్ యాదగిరి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మునుగోడు నియోజకవర్గంలో జరిగింది. ప్రస్తుతం ఆర్ఐ గోపరాజు, అసిస్టెంట్ యాదగిరి ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్