మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తో కలిసి రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 98 మంది రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు వంటి పనిముట్లు అందజేశారు. రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.