కొరటికల్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ సందర్భంగా సర్పంచ్ అద్దంకి రామలింగయ్య మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కోటీశ్వరులు కావాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ద్వారా మహిళల దైనందిన ఖర్చులు తగ్గి, సామాజిక-ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో జరిగింది.