చండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు. గురువారం చండూరు మండల కేంద్రంలో జరిగిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చండూరులోని 10 వార్డుల్లో ఉన్న సీపీఎం సానుభూతిపరులు, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు, కార్మికులకు, కూలీలకు ఇస్తానన్న వాగ్దానాలను అమలు చేయాలని ఆయన అన్నారు.