శుక్రవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పనితీరు, పరిసరాల స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. రిసెప్షన్, ఉమెన్ హెల్ప్ డెస్క్, లాక్ అప్ వంటి ప్రదేశాలను పరిశీలించి, ఫిర్యాదులలో జాప్యం చేయకుండా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.