నల్లగొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామస్తులు గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించగా, గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదని గ్రామస్తులు ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ గత నెల 28వ తేదీన హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు, కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బహిష్కరణతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది.