పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి - సఫియా బేగం

2చూసినవారు
పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి - సఫియా బేగం
గ్రామంలోని పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని నీటి వృధాను అరికట్టడానికి నడుం కట్టాలని త్రిపురారం మండలం రాగడప గ్రామ సర్పంచ్ షేక్ సఫియా బేగం అన్నారు. బుధవారం గ్రామంలోని పురవీధులలో మట్టితో నిండిపోయినటువంటి మురుగు కాలువను జెసిబి సహాయంతో తొలగించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి అవుట పల్లవితో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించడంతోపాటు నీటి వృధాని అరికట్టాలని ఇంటిలో వాడినటువంటి నీటిని పెరటి మొక్కలకు వెళ్లే విధంగా చూసుకోవడంతోపాటు ఇంకుడు గుంతకు వెళ్లే విధంగా చేయాలని అన్నారు. అదేవిధంగా అవసరమైనప్పుడు మాత్రమే లైట్లు ఫ్యాన్లు ఉపయోగించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్