వర్షాలు తగ్గినందున కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టుకుని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రైతులు వారి ధాన్యాన్ని ఆరబెట్టుకుని సిద్ధంగా ఉన్నట్లయితే కాంటాలు వేసి మిల్లులు పంపిస్తామని చెప్పారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా, అనుముల (హలియా) మండలం, రామడుగు లో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కుప్పలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడారు.